ఇలా చేస్తే కంటతడి పెట్టకుండా ఉల్లిపాయలు కట్‌ చేసేయచ్చు!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే వేసుకున్నాక కూరకు ఎంత రుచి వస్తుందో దాన్ని కోయడంలోనూ అంతే కష్టం ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలను తరిగేటప్పుడు కళ్లు మండి నీరు కారుతూ ఉంటాయి. ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్యల కారణంగా విడుదలయ్యే సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వల్ల కంటి నుంచి నీరు వస్తుంది.

Updated : 28 Jan 2022 13:02 IST

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే వేసుకున్నాక కూరకు ఎంత రుచి వస్తుందో దాన్ని కోయడంలోనూ అంతే కష్టం ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలను తరిగేటప్పుడు కళ్లు మండి నీరు కారుతూ ఉంటాయి. ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్యల కారణంగా విడుదలయ్యే సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వల్ల కంటి నుంచి నీరు వస్తుంది. అయితే ఉల్లిగడ్డలను కోసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరగకుండా చూసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా మరి..

పలుచగా ఉండాలి...

లావుగా, పదును లేకుండా ఉన్న చాకుతో కోస్తే ఉల్లిపాయ పొరల నుంచి సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ ఎక్కువగా విడుదల అవుతుంది. దీంతో కళ్లు మండటంతో పాటు కళ్ల నుంచి నీరు కూడా కారుతుంది. అందుకే పలుచగా, పదునుగా ఉండే చాకుని ఉపయోగించాలి. దీనివల్ల ఉల్లి నుంచి వెలువడే రసాయనాల మోతాదు తగ్గడం వల్ల కళ్లు అంతగా మండవు.

ఫ్రిజ్‌లో పెట్టాలి..

కోసే ముందు ఉల్లిపాయలను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా కూడా కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ద్రవరూపంలో ఉన్న రసాయనాలు గడ్డకట్టడం వల్ల వాటిని కోసినప్పుడు ఆ రసాయనాలు తక్కువగా విడుదలవుతాయి.

అప్పుడు నీటిలో వేయాలి..

ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత నీటిలో వేయడం అందరికీ తెలిసిందే. అయితే వీటిని సగానికి ముక్కలుగా కోసిన తర్వాత నీటిలో వేయడం మంచిది. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

కొద్దిసేపు ఉంచాలి..

సగానికి తరిగిన ఉల్లిపాయను చాపింగ్‌ బోర్డుపై బోర్లించడం ద్వారా కూడా రసాయనాల విడుదల తగ్గి కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. చాలామంది ఉల్లిపాయలను కోసిన వెంటనే గిన్నెలో వేసేస్తూ ఉంటారు. దీనివల్ల మరింతగా రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి చాపింగ్‌ బోర్డ్‌ మీద కోసినవి కోసినట్లుగానే ఉంచి మొత్తం పూర్తయిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి.

గాలి ప్రసరించే చోట..

గాలి బాగా ప్రసరించే చోట మాత్రమే ఉల్లిపాయలను కోయాలి. అలాగని ఫ్యాన్‌ కింద కూర్చుని కోయడం కూడా మంచిది కాదు. కిచెన్‌లో ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు ఎగ్జాస్ట్‌ దగ్గరలో నిల్చుంటే కళ్లు ఎక్కువగా మండకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్