Rishabh Pant: వికెట్‌ కీపర్లలో పంత్‌.. బ్రియాన్‌ లారా: పాక్ మాజీ కెప్టెన్

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ను వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాతో పోల్చాడు...

Published : 04 Jul 2022 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ను వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాతో పోల్చాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా పంత్‌ (146) టీ20 మ్యాచ్‌ ఆడినట్లు ఆడాడు. దీంతో అందరితోనూ అతడు ప్రశంసలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే లతీఫ్‌ సైతం తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ పంత్‌ను మెచ్చుకున్నాడు.

‘అతడు వికెట్‌ కీపర్లలో బ్రియాన్‌ లారా. ఈ మ్యాచ్‌ బర్మింగ్‌హామ్‌లో జరుగుతోంది. అక్కడే లారా వార్‌విక్‌షైర్‌ జట్టుతో ఆడినప్పుడు 501 పరుగులు చేశాడు. పంత్ బ్యాటింగ్‌లోనూ లారా ఆడే పలు షాట్లు కనిపించాయి. బంతి తనవద్దకు వచ్చే వరకు ఎదురు చూశాడు. ఫాస్ట్‌ బౌలర్లపై మిడ్‌వికెట్‌ మీదుగా అతడు ఆడిన 2,3 షాట్లు అద్భుతంగా ఉన్నాయి. పంత్‌ను ఒత్తిడికి గురి చేసేందుకు ఇంగ్లాండ్‌ ఒక గల్లీ ఫీల్డర్‌తో సహా నలుగురు స్లిప్‌ ఫీల్డర్లను పెట్టింది. అయినా, అతడు పరుగులు చేసేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు’ అని లతీఫ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని