Krishna Vamsi: డైరెక్టర్‌ కృష్ణవంశీ భారీ ప్లాన్‌.. రూ.300 కోట్లతో ప్రాజెక్ట్

కుటుంబకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొనే టాలీవుడ్‌ దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamsi) భారీ ప్లాన్‌కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్‌ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు....

Updated : 24 Nov 2022 12:52 IST

హైదరాబాద్‌: క్రియేటివ్‌, కుటుంబకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొనే దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamsi) భారీ ప్లాన్‌కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్‌ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓటీటీ ఎంట్రీపై ఆయన స్పందించారు. ‘‘ఓటీటీ కోసం ప్రాజెక్ట్‌ చేయాలనుకుంటున్నా. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తా. ఇప్పుడే దాని గురించి చెప్పను కానీ తప్పకుండా అది పెద్ద ప్లాన్‌ అవుతుంది. రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ సిద్ధమయ్యే అవకాశం ఉంది. మనం ఏది అనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఓటీటీలో ఉంటుంది. నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా ఉండదు’’ అని కృష్ణవంశీ వివరించారు.

కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ (Ranga Maarthaanda) చేస్తున్నారు. మరాఠీలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘నట్‌సామ్రాట్‌’కు(Natsamrat) ఇది రీమేక్‌. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థియేటర్‌ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ప్రస్తుతం ఉన్న రోజుల్లో తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా చూస్తున్నారు? వంటి భావోద్వేగభరితమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని