విలువ పెరగడం కాదు..స్థిరమైన లాభాలే ముఖ్యం

స్థిరమైన లాభాలను వెలువరచే కంపెనీలనే విజయవంతమైనవిగా పరిగణించాలని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా అన్నారు. కంపెనీ విలువ భారీగా పెరిగినా కూడా, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహం

Published : 29 Jan 2022 03:20 IST

వ్యాపారాలు విజయవంతమయ్యేది అపుడే

ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కేఎమ్‌ బిర్లా

ముంబయి: స్థిరమైన లాభాలను వెలువరచే కంపెనీలనే విజయవంతమైనవిగా పరిగణించాలని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా అన్నారు. కంపెనీ విలువ భారీగా పెరిగినా కూడా, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహం వంటి సంప్రదాయ అంశాలు బలంగా ఉంటేనే బలమైన కంపెనీగా గుర్తించాలని సూచించారు. కంపెనీ ఆర్థిక అంశాలే అసలు విషయాలని గుర్తుంచుకోవాలని 44 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.30 లక్షల కోట్ల) విలువైన ఆదిత్య గ్రూప్‌ ఛైర్మన్‌ పేర్కొన్నారు. జొమోటో, పేటీఎమ్‌ వంటి కంపెనీలు లాభాలను ప్రకటించకపోయినా.. విజయవంతంగా నిధులను సమీకరించడం; ఇంకా పలు కంపెనీల విలువలు చాలా పెరిగిన  నేపథ్యంలో బిర్లా పై విధంగా స్పందించారు. ప్రతి త్రైమాసికంలో స్థిర లాభాలతో జీవనోపాధి కల్పిస్తున్నవే దీర్ఘకాలంలో స్థిరమైన, విజయవంతమైన కంపెనీలుగా ఉండగలుగుతాయని ఆయన అన్నారు.

‘రానున్నది.. మూలధన మహోత్సవ్‌’

‘1991 ఆర్థిక సంస్కరణల నుంచి ఒక తరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రయోజనాలను పొందారు. వచ్చే దశాబ్ద కాలం ‘మూలధన మహోత్సవ్‌’గా మారుతుంది. భారత్‌ అందుకోసమే ఎదురుచూస్తోంద’ని  ఉద్యోగులకు రాసిన కొత్త ఏడాది నోట్‌లో బిర్లా పేర్కొన్నారు. ‘కరోనాపై మనం విజయం సాధించామని కానీ.. మహమ్మారి ముగింపునకు ఇది ప్రారంభమమనీ మనం భావించకూడదని ‘తాజా అనుభవం’ మనకు నేర్పింది. మన రోజువారీ జీవితాల్లో కరోనా ఒక భాగంగా మారొచ్చ’ని ఆయన అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని